Last Modified:Wednesday,September 28 2016. 3:12AM

శరణాగతి ఎలా సిద్ధిస్తుంది


నిగూఢ కాండలోని 9వ అధ్యాయం


గురువుకు సర్వస్య శరణాగతి చేసినపుడే పూర్ణ అనుగ్రహం కలుగుతుందని, శరణాగతి చేయడం కష్టమని, అందుకే స్వల్ప భక్తులు మాత్రమే అనుగ్రహించబడ్డారని, మీరు అవగతం చేసుకున్నారు.

శరణాగతి సిద్దించకపోవడానికి దోషాలు 5:
1. వివేకం లేకపోవడం
2. జీవిత లక్ష్యం ఏమిటో తెలియకపోవడం
3. త్యాగం చేయకపోవడం
4. గురు ఆజ్ఞా పాలన చేయకపోవడం
5. నేను - నాది అనే భావాలు త్యజించకపోవడం


ఎవరు నీకు క్షణిక సుఖాన్ని - అనిత్య ఆనందాన్ని, అపవిత్రతను - దుష్ట సంస్కారాన్ని, బంధాన్ని - భ్రష్టత్వాన్ని ప్రసాదిస్తారో వారిని ప్రేమించడం, సేవించడం అవివేకం కాబట్టి...

ఏది సత్యమో దానిని ప్రేమించాలి.
ఏది అసత్యమో దానిని త్యజించాలి.
ఏది నిత్యమో దానికై కృషి చేయాలి.
ఏది అనిత్యమో దానిని త్యజించాలి.


ఎప్పుడు వివేకం కలుగుతుందో, జీవిత లక్ష్యం ఏమిటో , జీవిత పరమార్థం ఏమిటో అవగతం అవుతుంది. ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందో సహజంగా త్యాగం కలుగుతుంది. త్యాగం కలిగినప్పుడే శరణాగతి సులభంగా కలుగుతుంది.

- శ్రీ రమణానంద మహర్షి

Read more for Shiva Shakthi Sai TV news
ఈనాటి గురువులలో కొంతమంది విడ్డూరంగా, అశాస్త్రీయంగా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం "అహంకారం - దర్పం. శిష్యసేకరణ - కీర్తివాంఛ - మతవ్యాప్తి" ఈ కారణాల వలన రకరకాల జిమ్మిక్కులతో...
ఏ క్షణం ఆధారానికి భంగం కలుగుతుందో, నాశనం సంభవిస్తుందో, ఆ క్షణమే ఆలంబనం నశిస్తుందని మీరు అవగతం చేసుకున్నారు. గురుశిష్య సంబంధానికి ఆధారం బ్రహ్మజ్ఞానం. ఎంతవరకు శిష్యుడ...
గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండటానికి ప్రధాన కారణాలు మూడు 1. జ్ఞానం లేకపోవడం 2. బ్రహ్మజ్ఞానాన్ని కోరకపోవడం 3. పర్యవసానం తెలియకపోవడం 1. జ్ఞానం లేకపోవడం: లోకములో తల్లిదండ్రులను...

Gallery for more +
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||54 FEET ARUNACHALESHWARA SHIVA LINGA ABHISHEKAM||22ndFeb||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Arunachala Aksharamanamala Audio CD Release By Siddhaguru Sri Ramanananda Maharshi||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Veda Patanam||22nd Feb||Shiva Shakthi Sai TV