Last Modified:Wednesday,September 28 2016. 3:36AM

సంస్కార స్వరూపం


నిగూఢ కాండ లోని 11వ అధ్యాయం


గురుశిష్య సంబంధానికి మూలస్తంభాలైన నాలుగింటిలో చివరిది సంస్కారం. శిష్యుడికి ప్రగాఢ విశ్వాసం, సర్వస్య శరణాగతి, త్యాగం సిద్ధించినా సంస్కారం గనక లేకపోతే అన్నీ వ్యర్థమవుతాయి. సంబంధం వీగిపోతుంది, విఫలమవుతుంది, నశిస్తుంది. కాబట్టి ఈ నాలుగింటిలో సంస్కారం చాలా శక్తివంతమైనది, కీలకమైనది, ప్రధానమైనది.

పూర్వ జన్మ సుకృతం వలన, దైవానుగ్రహం వలన, రుణానుబంధం వలన గురు అనుగ్రహాన్ని శిష్యులు అనుభవించినా ఈ సంస్కారం లేకపోవడం వలననే...

"గురు పాదాల నుంచి మామిడి పుతలుగా రాలిపోతారు.
కృతజ్ఞత లేక అవివేకంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తారు.
గురు మాటలను, గురు చేష్టలను అపార్థం చేసుకుంటారు.
అహంకారానికి, అసూయలకు గురై విమర్శలు చేస్తారు.
లోభానికి బలై గురువును నిందిస్తారు."

కాబట్టి సంస్కారం లేని విశ్వాసం, సర్వస్య శరణాగతి, త్యాగం వ్యర్థం, నిరుపయోగం, అసంప్రదాయం. అసలు సంస్కారం అంటే ఏమిటి?

"గురువును ఏ విధంగా సేవించాలో - ఏ విధంగా ప్రేమించాలో
గురువును ఏ విధంగా ఆరాధించాలో - ఏ విధంగా చింతించాలో
గురువును ఏ విధంగా ప్రవర్తించాలో - ఏ విధంగా ప్రవర్తించకూడదో
తోటి శిష్యులతో ఏ విధంగా ప్రవర్తించాలో - ఏ విధంగా ప్రవర్తించకూడదో"

దానిని సంస్కారం అంటారు.

- శ్రీ రమణానంద మహర్షి

Read more for Shiva Shakthi Sai TV news
ఈనాటి గురువులలో కొంతమంది విడ్డూరంగా, అశాస్త్రీయంగా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం "అహంకారం - దర్పం. శిష్యసేకరణ - కీర్తివాంఛ - మతవ్యాప్తి" ఈ కారణాల వలన రకరకాల జిమ్మిక్కులతో...
ఏ క్షణం ఆధారానికి భంగం కలుగుతుందో, నాశనం సంభవిస్తుందో, ఆ క్షణమే ఆలంబనం నశిస్తుందని మీరు అవగతం చేసుకున్నారు. గురుశిష్య సంబంధానికి ఆధారం బ్రహ్మజ్ఞానం. ఎంతవరకు శిష్యుడ...
గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండటానికి ప్రధాన కారణాలు మూడు 1. జ్ఞానం లేకపోవడం 2. బ్రహ్మజ్ఞానాన్ని కోరకపోవడం 3. పర్యవసానం తెలియకపోవడం 1. జ్ఞానం లేకపోవడం: లోకములో తల్లిదండ్రులను...

Gallery for more +
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||54 FEET ARUNACHALESHWARA SHIVA LINGA ABHISHEKAM||22ndFeb||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Arunachala Aksharamanamala Audio CD Release By Siddhaguru Sri Ramanananda Maharshi||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Veda Patanam||22nd Feb||Shiva Shakthi Sai TV