Last Modified:Thursday,September 29 2016. 3:45AM

బ్రహ్మజ్ఞానం కోరకపోవడం


గురుశిష్య సంబంధం గందర గోళంగా ఉండడానికి 2వ కారణం


ఏ క్షణం ఆధారానికి భంగం కలుగుతుందో, నాశనం సంభవిస్తుందో, ఆ క్షణమే ఆలంబనం నశిస్తుందని మీరు అవగతం చేసుకున్నారు. గురుశిష్య సంబంధానికి ఆధారం బ్రహ్మజ్ఞానం. ఎంతవరకు శిష్యుడ బ్రహ్మజ్ఞానం కోరుకుంటాడో, అంతవరకే ఆలంబనమైన ప్రేమ వుంటుంది. ఏ క్షణం నాకు బ్రహ్మజ్ఞానం అవసరములేదని శిష్యుడు నిర్ణయిస్తాడో ప్రేమ నశిస్తుంది. తక్షణమే పతనం అవుతుంది.

ఈనాటి చాలా మంది శిష్యులలో ఇదే జరుగుచున్నది. అందుకే ఒక చొక్కాను విడిచినట్లు గురువులను త్యజిస్తున్నారు, నిందిస్తున్నారు. ప్రేమ లేకుండా, స్వార్థముతో, ప్రాపంచిక కోరికలతో గురువును సేవిస్తుంటారు. అంటే వీరి గురుసేవలో ఆలంబనం లేదు, ఆధారం కూడా లేదు. ఇలాంటి వారు...

"ప్రాపంచిక కోరికలు తీరినా గురువును మరచిపోతారు.
ప్రాపంచిక కోరికలు తీరకపోయినా గురువును మరచిపోతారు."

పైగా తమ స్వార్థం కోసం గురువుని కూడా బలిపశువును చేస్తారు. అపకీర్తిని కలిగిస్తారు. కాబట్టి బ్రహ్మజ్ఞానం కోరని శిష్యుడు శిష్యుడే కాడు.

- శ్రీ రమణానంద మహర్షి

Read more for Shiva Shakthi Sai TV news
ఈనాటి గురువులలో కొంతమంది విడ్డూరంగా, అశాస్త్రీయంగా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం "అహంకారం - దర్పం. శిష్యసేకరణ - కీర్తివాంఛ - మతవ్యాప్తి" ఈ కారణాల వలన రకరకాల జిమ్మిక్కులతో...
గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండటానికి ప్రధాన కారణాలు మూడు 1. జ్ఞానం లేకపోవడం 2. బ్రహ్మజ్ఞానాన్ని కోరకపోవడం 3. పర్యవసానం తెలియకపోవడం 1. జ్ఞానం లేకపోవడం: లోకములో తల్లిదండ్రులను...
గురుశిష్య సంబంధానికి మూలస్తంభాలైన నాలుగింటిలో చివరిది సంస్కారం. శిష్యుడికి ప్రగాఢ విశ్వాసం, సర్వస్య శరణాగతి, త్యాగం సిద్ధించినా సంస్కారం గనక లేకపోతే అన్నీ వ్యర్థమవుతాయి. సంబంధం వీగిపోతుంది,...

Gallery for more +
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||54 FEET ARUNACHALESHWARA SHIVA LINGA ABHISHEKAM||22ndFeb||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Arunachala Aksharamanamala Audio CD Release By Siddhaguru Sri Ramanananda Maharshi||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Veda Patanam||22nd Feb||Shiva Shakthi Sai TV