Last Modified:Thursday,September 29 2016. 3:49AM

నిగూఢ కాండ లోని 13వ అధ్యాయం


గురుశిష్య సంబంధ నిగూఢ రహస్యం


ఈనాటి గురువులలో కొంతమంది విడ్డూరంగా, అశాస్త్రీయంగా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం...

"అహంకారం - దర్పం.
శిష్యసేకరణ - కీర్తివాంఛ - మతవ్యాప్తి"

ఈ కారణాల వలన రకరకాల జిమ్మిక్కులతో శిష్యులను ఆకర్షిస్తున్నారు. రకరకాల కుయుక్తులు ఉపయోగిస్తున్నారు. రవ్వంత మహిమని కొండంతగా చేసి భూతద్దంలో చూపుతున్నారు. గురు లక్షణాలలో ఒక లక్షణం కూడా ఉండదు. నేను గురువునని ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నారు. దైవ లక్షణాలలో ఒక లక్షణం, దైవ శక్తులలో ఒక శక్తి కూడా ఉండదు. కాని నేను దేవుడినని వెర్రి ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఈ వెర్రి ప్రచారాలు చూచి వెర్రిగా భక్తులు దేవుడని, గురువని ఫోటోలు పెట్టి పూజించడం, మూర్ఖ సేవలు, ఆరాధనలు చేయడం, కొన్ని రోజులకే మరొకరి ఫోటో పెట్టి పూజించడం. ఇది వెర్రి గురువులు - వెర్రి శిష్యుల అజ్ఞాన సంబంధం.

పైన పటారం - లోన లొటారం అన్నట్లు ఈనాటి కొంతమంది గురువులలో బడాయి ఎక్కువయింది, అసలు తక్కువయింది? అసలు ఏమిటి? శక్తి, సిద్ధత్వం.

"నాకు ఎంత మంది శిష్యులు వున్నారు - నాకు ఎన్ని కోట్ల ధనముంది. నాకు ఎన్ని బ్రాంచీలు వున్నాయి - నాకు ఎంత కీర్తి వుంది."

అని పోటీ పడుతున్నారే గాని....

"నాకు ఎంత శక్తి ఉంది - నాకు ఎన్ని దివ్యశక్తులు వున్నాయి?
నాకు వున్న సిద్ధత్వం ఏపాటిది - నాకు వున్న పవిత్రత ఎంతటిది?
నాకు వున్న సంస్కారం ఏమిటి - నాకు వున్న గురుప్రేమ ఏమిటి?"

అనేవి చూసుకోవడం లేదు, సరిచేసుకోవటం లేదు.

యథా రాజ తథా ప్రజా అన్నది శాస్త్రం. అదే విధంగా గురువు ఎలాంటి వాడైతే, శిష్యులు అలాంటి వారవుతారు. శిష్యులలో ఉత్తమ సంస్కారం రావాలంటే ముందు గురువులలో సంస్కారం రావాలి. అంతవరకు ఆ సంస్కార సిద్ధి శిష్యులకు కలుగదు.

- శ్రీ రమణానంద మహర్షి

Read more for Shiva Shakthi Sai TV news
ఏ క్షణం ఆధారానికి భంగం కలుగుతుందో, నాశనం సంభవిస్తుందో, ఆ క్షణమే ఆలంబనం నశిస్తుందని మీరు అవగతం చేసుకున్నారు. గురుశిష్య సంబంధానికి ఆధారం బ్రహ్మజ్ఞానం. ఎంతవరకు శిష్యుడ...
గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండటానికి ప్రధాన కారణాలు మూడు 1. జ్ఞానం లేకపోవడం 2. బ్రహ్మజ్ఞానాన్ని కోరకపోవడం 3. పర్యవసానం తెలియకపోవడం 1. జ్ఞానం లేకపోవడం: లోకములో తల్లిదండ్రులను...
గురుశిష్య సంబంధానికి మూలస్తంభాలైన నాలుగింటిలో చివరిది సంస్కారం. శిష్యుడికి ప్రగాఢ విశ్వాసం, సర్వస్య శరణాగతి, త్యాగం సిద్ధించినా సంస్కారం గనక లేకపోతే అన్నీ వ్యర్థమవుతాయి. సంబంధం వీగిపోతుంది,...

Gallery for more +
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||54 FEET ARUNACHALESHWARA SHIVA LINGA ABHISHEKAM||22ndFeb||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Arunachala Aksharamanamala Audio CD Release By Siddhaguru Sri Ramanananda Maharshi||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Veda Patanam||22nd Feb||Shiva Shakthi Sai TV